manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 30 December 2025, 1:13 am Editor : Mana Praja Prathinidhi

అక్బర్‌పేట్ గ్రామంలో నూతన గ్రామసభ-సమస్యల పరిష్కారానికి కార్యాచరణ.

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లి మండలం. సిద్దిపేట జిల్లా. డిసెంబర్30
అక్బర్‌పేట్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మండల కుమార్ అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభను నిర్వహించారు. గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పెండింగ్ పనులపై ఈ గ్రామసభలో విస్తృతంగా చర్చ జరిగింది.గ్రామంలోని డ్రైనేజీ సమస్యలు, విధిదీపాల ఏర్పాటు, అమ్మ హాస్పిటల్ నుంచి మెయిన్ రోడ్ వరకు డ్రైనేజీ నిర్మాణం వంటి ముఖ్య సమస్యలను ప్రాధాన్యతగా తీసుకున్నారు. అలాగే ట్రాక్టర్‌కు సంబంధించిన పెండింగ్ బిల్లులు, ఇతర బిల్లుల చెల్లింపుపై చర్చించి త్వరితగతిన పరిష్కారం చూపాలని నిర్ణయించారు.గ్రామ పరిశుభ్రత, ఎంపీడబ్ల్యూ కార్మికుల జీతాల చెల్లింపు, కూడవెల్లి కామన్ ప్రాంతంలో వీధిదీపాల ఏర్పాటు అంశాలపై కూడా గ్రామసభలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలని సభ్యులు సూచించారు.మిషన్ భగీరథ ఇంట్రాలైన్ సమస్యల పరిష్కారం, హనుమాన్ దేవాలయం వద్ద మినీ నీటి ట్యాంక్ ఏర్పాటు, తైబజార్ వేలం నిర్వహణ అంశాలపై గ్రామస్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే గ్రామంలో పుటపత్ తొలగింపు, అమ్మ హాస్పిటల్, ప్రైమరీ స్కూల్, కూడవెల్లి కామన్ ప్రాంతాల్లో బ్రేక్ కట్టల నిర్మాణంపై చర్చ జరిగింది.ఈ గ్రామసభలో సర్పంచ్ మండల కుమార్‌తో పాటు ఉప సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ. ఆశావర్కర్ పారిశుధ్యకార్మికులు వార్డు సభ్యులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని సర్పంచ్ ఈ సందర్భంగా తెలిపారు.