అక్బర్‌పేట్ గ్రామంలో నూతన గ్రామసభ-సమస్యల పరిష్కారానికి కార్యాచరణ.

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లి మండలం. సిద్దిపేట జిల్లా. డిసెంబర్30అక్బర్‌పేట్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మండల కుమార్ అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభను నిర్వహించారు. గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పెండింగ్ పనులపై ఈ గ్రామసభలో విస్తృతంగా చర్చ జరిగింది.గ్రామంలోని డ్రైనేజీ సమస్యలు, విధిదీపాల ఏర్పాటు, అమ్మ హాస్పిటల్ నుంచి మెయిన్ రోడ్ వరకు డ్రైనేజీ నిర్మాణం వంటి ముఖ్య సమస్యలను ప్రాధాన్యతగా తీసుకున్నారు. అలాగే ట్రాక్టర్‌కు సంబంధించిన పెండింగ్ బిల్లులు, ఇతర బిల్లుల చెల్లింపుపై చర్చించి త్వరితగతిన పరిష్కారం చూపాలని నిర్ణయించారు.గ్రామ పరిశుభ్రత, ఎంపీడబ్ల్యూ కార్మికుల...