manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 27 December 2025, 1:44 pm Posted by : Mana Praja Prathinidhi

సర్పంచుల అధికారాలు, నిధుల విడుదలపై మంత్రికి వినతి

సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాం: మంత్రి జి. వివేక్ వెంకటస్వామి
సదాశివపేట,డిసెంబర్ 27(మనప్రజాప్రతినిధి)
శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి గారిని వారి నివాసంలో ఎర్ధనూర్ గ్రామ సర్పంచ్ పంబల్ల జ్యోతి దుర్గ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల తరఫున మంత్రిగారికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర సర్పంచులకు కల్పించాల్సిన 29 అధికారాలను వెంటనే అమలు చేయాలని, నిధులను సకాలంలో విడుదల చేయాలని, చెక్ పవర్ అధికారాన్ని పూర్తిగా సర్పంచులకే అప్పగించాలని కోరారు. అలాగే గ్రామసభలలో ఆమోదించిన అభివృద్ధి పనులకు తగిన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలను తమ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.దీనికి స్పందించిన మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, సర్పంచుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పూర్తి సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుండ్ల మాచర్ల సర్పంచ్ శ్రీహరి, మనసంపల్లి ఏడుపాయల సర్పంచ్ గండం సుశీల, నాయకులు రవీందర్, ఈదులకంటి ప్రసాద్, మల్లేశం, మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.