ఘనమైన పొగమంచుతో రోడ్డు ప్రమాదం
ఒక గేదె మృతి.. మరో గేదెకు తీవ్ర గాయాలుమనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం//డిసెంబర్13తిరుపతి జిల్లా ఏర్పేడు మండల పరిధిలో శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏర్పేడు నుంచి వెంకటగిరి వైపు వెళుతున్న రెండు గేదెలను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక గేదె అక్కడికక్కడే మృతి చెందగా, మరో గేదెకు తీవ్ర గాయాలు కావడంతో రోడ్డుపై కదలలేని స్థితిలో పడివుంది.తెల్లవారు జామున ఘనమైన పొగమంచు కమ్ముకోవడంతో రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అదే సమయంలో అటువైపు వెళుతున్న...