సిరిసిల్లలో పట్టపగలే దొంగతనం-బైక్ డిక్కీలోని రూ.99 వేల నగదు మాయం.

మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.డిసెంబర్ 28సిరిసిల్ల పట్టణంలో పట్టపగలే దొంగతనం చోటుచేసుకోవడం కలకలం రేపింది. బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకొని వెళ్తున్న ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని, బైక్ డిక్కీలో ఉంచిన రూ.99 వేల నగదును దుండగుడు తస్కరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తంగళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సంఘటన వివరాల ప్రకారం, ఈ నెల 11వ తేదీన జిల్లెల్ల గ్రామానికి చెందిన పబ్బతి ఎల్లారెడ్డి (తండ్రి: రాజిరెడ్డి) సిరిసిల్లలోని ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి రూ.99 వేల నగదును డ్రా...