శ్రీకాళహస్తిలో వాహనదారులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం

హెల్మెట్ లేకుండా పెట్రోల్ లేదు -డిసెంబర్ 15 నుంచి కఠిన చర్యలుమనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి.డిసెంబర్13తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ద్విచక్ర వాహనదారుల ప్రాణ భద్రత పరిరక్షణ లక్ష్యంగా శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద వన్ టౌన్ సీఐ ఆధ్వర్యంలో అవగాహన చర్యలు నిర్వహించారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ విక్రయించరాదని స్పష్టం చేస్తూ పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేక అవగాహన ఫ్లెక్సీలు...