manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 8:28 am Posted by : Mana Praja Prathinidhi

భద్రాచలం తరువాత భక్తుల హృదయాలను దోచుకున్న ముస్లాపూర్ శ్రీరామాలయం

తెలంగాణలో రెండో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ముస్లాపూర్ శ్రీరామాలయం

మెదక్.మనప్రజాప్రతినిధి.డిసెంబర్ 21
తెలంగాణ గడ్డపై శ్రీరామనామ స్మరణతో ప్రతిధ్వనించే పవిత్ర క్షేత్రాల్లో భద్రాచలం తరువాత రెండో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందినది మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలోని శ్రీరాములవారి ఆలయం. ఈ ఆలయం నేడు భక్తుల ఆరాధ్య దైవస్థానంగా విరాజిల్లుతోంది.ధనుర్మాస పవిత్రత నిండిన ఆదివారం రోజున ముస్లాపూర్ శ్రీరామాలయం భక్తులతో కళకళలాడింది. తెల్లవారుజామునే భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనంతో మనసు తృప్తి చెందారు.
ఈ సందర్భంగా చకిలం సురేష్, కటుకం శ్రీనివాస్, వారి కుటుంబ సభ్యులు,కటుకం వీరేశం కుటుంబ సభ్యులు, మాటూరి ఈశ్వరప్ప, ఇప్పఆగమయ్య, ఇప్ప కృష్ణ,మద్దూరి అశోక్ పేర్లపై హర్షణ ఆరాధన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ప్రతి కుటుంబం తరఫున సమర్పించిన హారతులతో ఆలయ ప్రాంగణం భక్తి భావోద్వేగాలతో నిండిపోయింది.“జయ శ్రీరామ్” నామస్మరణతో వాతావరణం మార్మోగగా, భక్తుల కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి.ఈ సందర్భంగా ఆలయ పూజారి ప్రత్యేక అర్చన పూజలు నిర్వహించి, భక్తులందరికీ శ్రీరామచంద్రుని కృప, సుఖశాంతులు, ఆయురారో గ్యాలు కలగాలని హృదయపూర్వకంగా ఆశీర్వదించారు.
ధనుర్మాసంలో ముస్లాపూర్ శ్రీరామాలయంలో లభించే ఆధ్యాత్మిక శక్తి భక్తులను మళ్లీ మళ్లీ ఈ పుణ్యక్షేత్రం వైపు ఆకర్షిస్తోందని స్థానికులు, భక్తులు తెలిపారు.