భద్రాచలం తరువాత భక్తుల హృదయాలను దోచుకున్న ముస్లాపూర్ శ్రీరామాలయం

•తెలంగాణలో రెండో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ముస్లాపూర్ శ్రీరామాలయం మెదక్.మనప్రజాప్రతినిధి.డిసెంబర్ 21తెలంగాణ గడ్డపై శ్రీరామనామ స్మరణతో ప్రతిధ్వనించే పవిత్ర క్షేత్రాల్లో భద్రాచలం తరువాత రెండో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందినది మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలోని శ్రీరాములవారి ఆలయం. ఈ ఆలయం నేడు భక్తుల ఆరాధ్య దైవస్థానంగా విరాజిల్లుతోంది.ధనుర్మాస పవిత్రత నిండిన ఆదివారం రోజున ముస్లాపూర్ శ్రీరామాలయం భక్తులతో కళకళలాడింది. తెల్లవారుజామునే భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనంతో మనసు తృప్తి చెందారు.ఈ సందర్భంగా చకిలం సురేష్, కటుకం శ్రీనివాస్, వారి కుటుంబ సభ్యులు,కటుకం...