వేద మంత్రోచ్ఛారణల మధ్య కేకే భాగ్యలక్ష్మికి అపూర్వ గౌరవం
పదవిబాధ్యతలవేళ కేకే భాగ్యలక్ష్మికి వేదాశీస్సులుఅష్టైశ్వర్యాల దీవెనలతో కేకే భాగ్యలక్ష్మి – గ్రామం మొత్తంవాతావరణంమనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.డిసెంబర్20తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని మేర్లపాక గ్రామం ఈరోజు భక్తి-ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడింది. తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి కేకే రమణ సతీమణి, ఇటీవల శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్గా నియమితులైన కేకే భాగ్యలక్ష్మికి వేద పండితుల ఆశీర్వాదాలతో ఘన సన్మానం జరిగింది.తిరువల్లూరు నుంచి ప్రత్యేకంగా వచ్చిన వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో భాగ్యలక్ష్మిని ఆశీర్వదిస్తూ, ఆమె కుటుంబం అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కలియుగ దైవం...