manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 29 December 2025, 12:07 pm Editor : Mana Praja Prathinidhi

గుడిపల్లి ZPHS పాఠశాలలో ఆధార్ సెంటర్ ప్రారంభం

దేవరకొండ.మనప్రజాప్రతినిధి//.డిసెంబర్29
గుడిపల్లి మండల కేంద్రంలోని స్థానిక ZPHS ఉన్నత పాఠశాలలో ఆధార్ సెంటర్‌ను స్థానిక సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌లో ఉన్న తప్పులను సరిచేసుకోవాలి. ఇందుకోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా, మన మండలంలోనే ఆధార్ సెంటర్ ప్రారంభించడం ఎంతో సంతోషకరం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సముద్రాల శ్రీనయ్య, MPO నవీన్, ఉప సర్పంచ్ ఆర్వేపల్లి శ్రీనయ్య, వార్డు సభ్యులు యర్ర వంశీ, కత్తుల రమేష్, యర్ర రామలింగం, బోడ నాగరాజు, వడ్లపల్లి శ్రీనివాస్, పోచం రెడ్డి వెంకట్ రెడ్డి, యర్ర అరుణ్ కుమార్, యర్ర సైదులు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ZPHS పాఠశాల అధ్యాపక బృందం ఈ కార్యక్రమంలో భాగమైంది.