manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 December 2025, 12:26 pm Editor : Mana Praja Prathinidhi

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

20మందికిపైగా ప్రయాణికులకు గాయాలు
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్24
కొండపాక మండల పరిధిలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు వెళ్తుండగా, దుద్దెడ శివారులోని నాగులబండ వద్ద రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కొండపాక, కొమురవెల్లి, చేర్యాల్, సిద్దిపేట ప్రాంతాల నుంచి 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మెడికల్ టెక్నీషియన్ శిరీష, పైలెట్ శ్రీనివాస్ సహకారంతో గాయపడిన వారిలో ఏడుగురిని అంబులెన్స్‌లలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పరిస్థితి విషమంగా ఉన్న పలువురు క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.