శ్రీ పరశురామేశ్వర స్వామిని దర్శించుకున్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులు
మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం,డిసెంబర్28ఎర్పేడు మండలంలో శైవ సంప్రదాయంలో విశేష ఖ్యాతి గాంచిన శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానాన్ని అన్నమయ్య జిల్లా కలెక్టర్ సుశాంత్ కుమార్ కుటుంబ సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.పురాణకథనాలప్రకారం పరశురామేశ్వర స్వామిదేవాలయంఎంతో మహిమాన్వితమైనదిగా భావిస్తారు.పరశురాముడు ప్రతిష్ఠించిన స్వయంభూ లింగంగా ఈ ఆలయానికి విశేష ప్రాముఖ్యత ఉంది. భక్తులు మనస్ఫూర్తిగా కోరిన కోరికలు తీరుతాయని, కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని భక్తుల నమ్మకం. శివ భక్తులకు ఈ క్షేత్రం ఒక పవిత్ర...