manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 4:56 am Editor : Mana Praja Prathinidhi

ఘనంగా ఆర్ద్రా మహోత్సవం

బ్రాహ్మీ ముహూర్త ఆర్ద్రాభిషేకంలో పాల్గొన్న కలెక్టర్ హైమవతి
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.డిసెంబర్8
కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆదివారం ఆర్ద్రా మహోత్సవం మహోన్నతంగా నిర్వహించారు. క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.మార్గశిర మాసంలో సంభవించిన ఆర్ద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని, బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున 4 గంటలకు గణపతి పూజతో వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సంతాన మల్లికార్జున స్వామికి పంచామృత, ఫలరసాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హైమవతి ఆలయానికి విచ్చేసి స్వయంగా రుద్రాభిషేకంలో పాల్గొని స్వామివారి దివ్యసన్నిధిలో పూజలు చేశారు. తర్వాత విజయదుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించబడాయి.ఉదయం పదిగంటలకు స్వస్తి వాచనం అనంతరం నవగ్రహ, దిక్పాలక, రుద్ర కలశాల ప్రతిష్ట నిర్వహించి, సంతాన పాశుపత అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు వైదిక ఘంటానాదాల మధ్య సాగాయి. ఆపై సంతాన పాశుపత హవనం, పూర్ణాహుతి కార్యక్రమాలు ఎంతో శోభాయమానంగా జరిగాయి.కార్యక్రమం ముగింపులో భక్తులకు అన్నప్రసాదం అందించి మహోత్సవాన్ని ముగించారు.