ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె. దేవరాజం
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్ 02
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె. దేవరాజం ప్రధాన అతిథిగా పాల్గొని విద్యార్థులకు హెచ్ఐవి, ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హెచ్ఐవి సంక్రమణకు గల కారణాలు, నివారణ చర్యలు, చికిత్స విధానాలు వంటి అంశాలను వివరించారు. దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు — మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో హెచ్ఐవి వ్యాప్తి అధికంగా ఉన్న విషయం విద్యార్థులకు తెలియజేశారు.
హెచ్ఐవిఎయిడ్స్ ప్రభావం సమాజంపై ఎలా పడుతుందో, భవిష్యత్ భారత పౌరులుగా విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవడం ఎంత ముఖ్యమో ప్రిన్సిపాల్ వివరించారు.కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బి. కుమారస్వామి, కె. లింగమూర్తి, పొలిటికల్ సైన్స్ లెక్చరర్ జె. విజయ్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.