manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 10 December 2025, 2:48 am Editor : Mana Praja Prathinidhi

బొల్లారం సర్పంచ్ అభ్యర్థిగా బెండ మీనా నామినేషన్

ఆడబిడ్డగా వస్తున్నాను… ఆశీర్వదించండి… బ్యాట్ గుర్తుకే ఓటు వేసి గెలిపించండి”
మెదక్ జిల్లా.బొల్లారం. మనప్రజాప్రతినిధి//డిసెంబర్10
బొల్లారం గ్రామ సర్పంచ్ పదవికి బెండ మీనా తన నామినేషన్ పత్రాలను ఈ రోజు మెదక్ మండల కేంద్రంలో దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “ఆడబిడ్డగా మీ ముందుకొస్తు న్నాను… ఆశీర్వదించండి. బ్యాట్ గుర్తుకే మీ విలువైన ఓటు వేసి నన్ను గెలిపించండి. గ్రామ అభివృద్ధి నా ఏకైక లక్ష్యం” అని అన్నారు. గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే బొల్లారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామస్తులకు అందు బాటులో ఉండే ప్రజాప్రతినిధిగా పనిచేస్తానని చెప్పారు.మీనా మరింతగా మాట్లాడుతూ“ప్రతి ఒక్కరి ఆశయాలు నెరవేర్చడం నా బాధ్యత. గ్రామ అభివృద్ధే నా అజెండా. మీరందరూ నా బ్యాట్ గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ పదవికి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.