మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్ 30
పిల్లలు, పెద్దలు, తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ సులభంగా చదివి అర్థం చేసుకునే విధంగా భగవద్గీత సిద్ధంగా ఉందని శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…భగవంతుని ముఖ పద్మముల నుంచి వెలువడిన దివ్య గ్రంథమైన భగవద్గీతను, వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా, వచన రూపంలో బొమ్మలతో కూడి, హైందవి వారి సౌజన్యంతో తెలుగులో ముద్రించటం జరిగిందని తెలిపారు.విద్యార్థి దశ నుంచే భగవద్గీతను చదవాలి, ఆచరించాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేపట్టినట్లు చెప్పారు.ప్రతి గ్రామంలో గీతా పారాయణం, ప్రతి ఇంటిలో గీతా గ్రంథం, ప్రతి ఒక్కరికి గీతా జ్ఞానం అనే లక్ష్యంతోనే శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తోందని వివరించారు.
కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే వారు, తమ భవిష్యత్తు గురించి కలలు కనే వారు, తాము నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించాలను కునే ప్రతి ఒక్కరికి, నిజమైన సుఖం అంటే ఏమిటో తెలుసుకోవాలను కునే వారికి భగవద్గీత ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మానవుని పుట్టుకకు, మరణానికి గల కారణాలను తెలుసుకోవాల నుకునే ప్రతి ఒక్కరికీ భగవద్గీత మార్గదర్శకమని, జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు భగవద్గీతను చదవడం ప్రారంభిస్తే కచ్చితంగా సమాధానం దొరుకుతుందని ఆయన స్పష్టం చేశారు.
తాను ప్రారంభించిన ఈ గీతా జ్ఞాన ప్రచార యజ్ఞానికి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి దీవించాలని కోరుతూ, ప్రజలందరికీ పాదాభివందనాలు తెలిపారు.. కృష్ణం వందే జగద్గురం.