manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 22 December 2025, 9:53 am Editor : Mana Praja Prathinidhi

కందికట్కూర్ గ్రామంలో ప్రమాణ స్వీకారం చేసిన వార్డు సభ్యులకు బిజెపి నాయకుల సన్మానం

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్22:
ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన వార్డు సభ్యులకు బిజెపి నాయకులు ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా 8వ వార్డు సభ్యుడు భూమల్ల ప్రశాంత్, 7వ వార్డు సభ్యులు చదువాల కళ్యాణి – శ్రీధర్లను బిజెపి నాయకులు పినికాశి అనిల్ శాలువాలతో సత్కరించారు.ఈ సన్మాన కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు తుమ్మనపల్లి కమలాకర్ రావు, చదువాల శ్రీధర్తో పాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని వార్డు సభ్యులకు అభినందనలు తెలిపారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వార్డు సభ్యులు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.