విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్యపై బొజ్జల బృందమ్మ ప్రత్యేక దృష్టి
మనప్రజాప్రతినిధి//రేణిగుంట మండలం.డిసెంబర్ 13రేణిగుంటలోని గురుకుల పాఠశాలను మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి, ఎమ్మెల్యే తల్లి బొజ్జల బృందమ్మ శనివారం ఆకస్మికంగా సందర్శించి విస్తృతంగా తనిఖీ నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యత, విద్యా ప్రమాణాలపై ఆమె సమగ్ర సమీక్ష చేపట్టారు. తరగతులనిర్వహణ తీరు, విద్యార్థుల హాజరు పట్టికలు, పరిశుభ్రత పరిస్థితుల ను స్వయంగా పరిశీలించిన ఆమె హాస్టల్ గదులు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను తనిఖీ చేసి వాటి నిర్వ హణపై అధికారులను ప్రశ్నించారు.విద్యార్థులతో నేరుగా మాట్లాడిన బొజ్జల...