manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 18 December 2025, 1:45 am Posted by : Mana Praja Prathinidhi

నూతన సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన బొజ్జల బృందమ్మ

మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్17
శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని ఏర్పేడు మండలం వికృతమాల గ్రామ పంచాయతీలో 200 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీమతి బొజ్జల బృందమ్మ భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. గ్రామాభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఈ రోడ్డు పనులతో ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కలగనున్నాయని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, మండల తెలుగు యువత అధ్యక్షులు పూల హేమాక్షి, మండల టీడీపీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు, పార్టీ సీనియర్ నాయకులు పేరం ధనం జయులు నాయుడు, నైనూరు పున్నారావు, బాలాజీ నాయుడు, మోహన్ నాయుడు, గుడిమల్లం గుడి ఛైర్మన్ బత్తల గిరి నాయుడు తదితరులు పాల్గొన్నారు.అలాగే బాబు నాయుడు, చిరంజీవుల నాయుడు, భూపతి నాయుడు, సుందర బాబు, కేశవులు, జయరామయ్య, మణి, విజయకుమార్, చలపతి, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, జనార్దన్, మురళి, మహేష్ సహా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

గ్రామ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయకులు పేర్కొంటూ, రోడ్డు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను కోరారు.