నూతన సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన బొజ్జల బృందమ్మ

మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్17శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని ఏర్పేడు మండలం వికృతమాల గ్రామ పంచాయతీలో 200 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీమతి బొజ్జల బృందమ్మ భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. గ్రామాభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఈ రోడ్డు పనులతో ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కలగనున్నాయని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, మండల తెలుగు యువత అధ్యక్షులు పూల హేమాక్షి, మండల టీడీపీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు, పార్టీ సీనియర్ నాయకులు...