manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 05 December 2025, 3:57 pm Posted by : Mana Praja Prathinidhi

30వ వార్షికోత్సవానికిబిఆర్ఎస్ రాష్ట్రనాయకులుKVR ఫౌండేషన్ చైర్మన్ వంశీధర్ రావుకి ఆహ్వాన

సిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధి//డిసెంబర్5
శ్రీ గంగాధర సహిత గంగా భవాని ఆలయం ప్రాంగణంలో, గంగపుత్ర సంఘం సిద్దిపేట వారు నిర్వహిస్తున్న 30వ వార్షికోత్సవ ఉత్సవాలు గంగమ్మ బోనాల పండుగలో భాగంగా, వారి ఆహ్వానం మేరకు బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు & KVR ఫౌండేషన్ ఛైర్మన్ కల్వకుంట్ల వంశీధర్ రావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.పండుగ సందర్బంగా ఆలయ పరిసరాలు భక్తుల రద్దీతో కళకళలాడగా, వంశీధర్ రావు అమ్మవారి ఆశీస్సులు అందుకొని అన్ని మంచి కార్యాలు సాఫల్యంగా సాగాలని కోరుకున్నారు. భక్తులు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు