గణితంతో భవిష్యత్తు నిర్మాణం ముస్లాపూర్ పాఠశాలలో గణిత దినోత్సవం
మెదక్,డిసెంబర్22(మనప్రజాప్రతినిధి):అల్లాదుర్గ్ మండలం ముస్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్‌ఎం రమేష్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గణితం ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమైన పాత్ర పోషిస్తుందని, చదువులోనే కాకుండా జీవిత నిర్ణయాలలోనూ దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయురాలు రుక్మిణి మాట్లాడుతూ, గణితం మన దైనందిన జీవితంలో అనివార్యమైన శాస్త్రం అని, ఇది తర్కశక్తి, విశ్లేషణా సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తుందని తెలిపారు. గణితాన్ని...