మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.డిసెంబర్6
సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని బుస్సాపూర్ గ్రామంలో సర్పంచ్ పదవికి బత్తిని కవిత ముందుకు వచ్చారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆశీస్సులతో, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చి గ్రామాభివృద్ధిపై తన ప్రాధాన్యతలను వెల్లడించారు.గ్రామంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల విషయంలో వారధిలా పనిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సక్రమంగా వినియోగించు కోవాలని బత్తిని కవిత కోరారు.తాను ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉండి, గ్రామ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నిబద్ధతతో అమలు చేస్తానని స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు కేటాయించిన “కత్తెర” గుర్తు మరియు క్రమ సంఖ్య-2ను ప్రజలు గుర్తుంచుకుని, ఎటువంటి గందరగోళం లేకుండా ఓటింగ్‌లో పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు.