manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 2:53 am Editor : Mana Praja Prathinidhi

బిఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు

మన ప్రజాప్రతినిధి//కొండపాక మండలం. డిసెంబర్ 2

సోమవారం కొండపాక రామాలయం వద్ద ఎలాంటి అనుమతి లేకుండా సమావేశం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతుల ప్రశాంత్, నూనె కుమార్, బొద్దుల తిరుపతి, భానుచందర్‌తో పాటు మరికొందరు కలిసి అనుమతి లేకుండా సమావేశం నిర్వహించినట్లు కుకునపల్లి ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందున సంబంధిత ధారాల ప్రకారం విచారణ చేపట్టి కేసులు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.