మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట భూంపల్లిమండలం,దుబ్బాక నియోజకవర్గం, సిద్ధిపేట జిల్లాడిసెంబర్ 3
అక్బర్‌పేట్ భూంపల్లి మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరిగిన నేపథ్యంలో 63 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు.
బుధవారం ఉదయం 10:10 గంటలకు, పెద్దమ్మ గుడి నిర్మాణంలో ఉన్న ప్రదేశంలో గ్రామస్తులు అనుమతి లేకుండా సమావేశం నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకే కులానికి చెందిన క్రింది ఐదుగురు సర్పంచ్ అభ్యర్థులు1.నీల ప్రభాకర్2.గోపరి యాదగిరి3.గోపరి కనకరాజు4.గోపరి శ్రీకాంత్5.వెల్పుల యేసుఎవరు ఎక్కువ విరాళం ఇస్తే వారికి కులస్తులు ఓట వేయాలని కుల పెద్దలు చర్చించినట్లు సమాచారం లభించినట్లు ఏసీపీ తెలిపారు.ఎన్నికల నియమావళి అమల్లోఉన్నసమయంలోఅనుమతిలేకుండా సమావేశాలు, ప్రలోభపరిచే చర్చలు,ఓట్ల కోసం డబ్బు లావాదేవీలపై నిర్ణయాలుచట్టవ్యతిరేకం అని ఏసీపీ స్పష్టం చేశారు.సబ్ ఇన్‌స్పెక్టర్ హరీష్ ఇచ్చిన సుమోటో పిటిషన్ ఆధారంగా కుల పెద్దలు 2 మంది 5 మంది సర్పంచ్ అభ్యర్థులు56 మంది సభ్యులుమొత్తం 63 మందిపై అక్బర్‌పేట్ భూంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. నమ్మదగిన సమాచారాన్ని అందించిన ఎస్‌ఐ హరీష్ గౌడ్, కానిస్టేబుల్ ప్రవీణ్, సంతోష్, సీసీ వినిత, హోంగార్డు తుకారాంలను ఆయన అభినందించారు.