manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 31 December 2025, 4:18 pm Editor : Mana Praja Prathinidhi

గ్రామపంచాయతీ ఎన్నికల డ్యూటీ చేసిన ఉద్యోగులకు CCLలు ఇవ్వాలి

జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి నగేష్ డిమాండ్
సిద్దిపేట,(మనప్రజాప్రతినిధి):డిసెంబర్ 31
గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా రెండవ ఫేస్‌లో (రెండవ శనివారం, ఆదివారం) ఎలక్షన్ డ్యూటీ నిర్వహించిన ఉద్యోగులకు **కాంపెన్సేటరీ క్యాజువల్ లీవ్ (CCL)లు మంజూరు చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి నగేష్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు కలెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజ్ కుమార్ గారికి వినతిపత్రం సమర్పించారు. అలాగే మే–2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధ్యాపకులకు ELలు మంజూరు చేయాలని సిద్దిపేట జిల్లా DIEO గారికి కూడావినతిపత్రం అందజేశారు.దరిపల్లి నగేష్ మాట్లాడుతూ…సిద్దిపేట జిల్లా కలెక్టర్ శ్రీమతి హేమావతి గారి ఆదేశాలను అనుసరిస్తూ ఉద్యోగులు ఎలాంటి లోపాలకు తావివ్వకుండా గ్రామపంచాయతీ ఎన్నికలను విజయవం తంగా పూర్తి చేశారని తెలిపారు. చాలామంది ఉద్యోగులు మొదటి, రెండవ, మూడవ ఫేస్‌లలో నిరంతరంగా విధులు నిర్వహించారని, ముఖ్యంగా రెండవ ఫేస్‌లో సెలవు దినాలైన రెండవ శనివారం, ఆదివారం కూడా పనిచేశామని గుర్తు చేశారు.ఈ నేపథ్యంలో రెండవ ఫేస్‌లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు తప్పనిసరిగా CCLలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల జగిత్యాల జిల్లా కలెక్టర్ ఈ విషయంలో ప్రొసీడింగ్స్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, సిద్దిపేట జిల్లాలో కూడా వెంటనే CCLలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ విడుదల చేయాలని కోరారు. అలా చేస్తే భవిష్యత్తులో ఉద్యోగులు ఎన్నికల విధుల్లో మరింత ఉత్సాహంగా పాల్గొంటారని తెలిపారు.
అలాగే గత పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన లెక్చరర్స్‌కు ఇప్పటివరకు ELలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇవ్వలేదని, విద్యాశాఖలో DEO ప్రొసీడింగ్స్ ఇచ్చిన అనంతరం ఉపాధ్యాయులు ELలు పొందారని ఉదాహరణగా తెలిపారు. అదే విధంగా డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా అధ్యాపకులకు సంబంధించిన ప్రొసీడింగ్స్ జారీ చేసి అందరికీ ELలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు పంజా గంగాధర్ తో పాటు పలువురు నాయకులు, ఉద్యోగ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.