manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 2:36 am Editor : Mana Praja Prathinidhi

హైవేపై హడావుడి… గాజులమండ్యంలో పైపుల లారీ బోల్తా!

పోలీసుల తక్షణ స్పందనతో భారీ ట్రాఫిక్ జామ్ తప్పింది
మనప్రజాప్రతినిధి//రేణిగుంట మండలం.డిసెంబర్ 11
శ్రీకాళహస్తి–చెన్నై జాతీయ రహదారి గాజులమండ్యం వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన ప్రమాదం స్థానికంగా హడావుడి రేపింది. ల్యాంకో కంపెనీకి చెందిన భారీ పైపుల లోడు లారీ అదుపు తప్పి రహదారి మీదే బోల్తా పడి చుట్టుపక్కల భయాందోళన కలిగించింది.
శ్రీకాళహస్తి నుంచి చెన్నై వైపుకు వెళ్తున్న లారీ, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. లారీ పూర్తిగా ఒరిగిపోవడంతో పైపులు రహదారిమీద చిందరవందరగా పడి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొంది. సమాచారం  అందుకున్న వెంటనే సీఐ మంజునాథ్ రెడ్డి, ఎస్సై సూరే నాగరాజు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వేగంగా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. బోల్తా పడిన లారీని తొలగించేందుకు క్రేన్ల సహాయంతో ఆపరేషన్ కొనసాగించగా, వాహనాలను ప్రత్యామ్నా య మార్గాల్లోకి మళ్లించి రద్దీ నియంత్రించారు. ఈప్రమాదంలో డ్రైవర్‌ కు స్వల్పగాయాలైనట్లు సమాచారం.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.