హైవేపై హడావుడి… గాజులమండ్యంలో పైపుల లారీ బోల్తా!

పోలీసుల తక్షణ స్పందనతో భారీ ట్రాఫిక్ జామ్ తప్పిందిమనప్రజాప్రతినిధి//రేణిగుంట మండలం.డిసెంబర్ 11శ్రీకాళహస్తి–చెన్నై జాతీయ రహదారి గాజులమండ్యం వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన ప్రమాదం స్థానికంగా హడావుడి రేపింది. ల్యాంకో కంపెనీకి చెందిన భారీ పైపుల లోడు లారీ అదుపు తప్పి రహదారి మీదే బోల్తా పడి చుట్టుపక్కల భయాందోళన కలిగించింది.శ్రీకాళహస్తి నుంచి చెన్నై వైపుకు వెళ్తున్న లారీ, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. లారీ పూర్తిగా ఒరిగిపోవడంతో పైపులు రహదారిమీద చిందరవందరగా పడి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడే పరిస్థితి...