•ఎమ్మెల్యే బొజ్జల, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ
మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.డిసెంబర్ 26
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం సందర్భంగా, తిరుపతి అగ్రికల్చరల్ కాలేజ్ హెలిప్యాడ్ వద్ద శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్–ఆఫిషియో బోర్డు సభ్యులు, టీడీపీ తిరుపతి పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ఘనంగా, మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా తిరుపతి జిల్లా రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి ప్రాధాన్యాలు, పార్టీ బలోపేతం అంశాలపై ముఖ్యమంత్రితో కీలక చర్చ జరిగింది. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి నేతృత్వమే దిశానిర్దేశకమని నేతలు పేర్కొన్నారు.అలాగే, తనను టీడీపీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా నియమించి నందుకు పార్టీ అధిష్ఠానానికి డాలర్స్ దివాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో పని చేస్తామని స్పష్టం చేశారు.