manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 25 December 2025, 12:00 pm Posted by : Mana Praja Prathinidhi

ఎర్పేడు మండలంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం •సర్పంచ్ శివయ్య ఆధ్వర్యంలో వేడుకలు – యేసు ప్రభు శాంతి, ప్రేమ సందేశం.
మనప్రజాప్రతినిధి//ఎర్పేడు మండలం,డిసెంబర్25:
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలో సర్పంచ్ నల్ల పాలెం శివయ్య ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగానిర్వహించ బడ్డాయి. ఈ కార్యక్రమానికి చర్చి ఫాదర్ ఆల్బర్ట్ హాజరుకాగా, ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డా. సిపాయి సుబ్రహ్మణ్యం విచ్చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా యేసు ప్రభువు బోధించిన శాంతి, ప్రేమ, సోదరభావం వంటి గొప్ప మానవతా విలువలను ప్రజలకు వివరించారు. అనంతరం చర్చి ఫాదర్‌ను కలసి స్థానిక సమస్యలపై చర్చించారు. క్రిస్మస్ పండుగ గొప్పతనం, సమాజంలో మానవతా విలువలను పెంపొందించాల్సిన అవసరాన్ని ఫాదర్ ఆల్బర్ట్ వివరించారు.
కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ డా. సిపాయి సుబ్రహ్మణ్యం నిరుపేద స్త్రీలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం క్రిస్మస్ సందర్భంగా కేక్‌ను కట్ చేసి పిల్లలకు తినిపించారు. వేడుకల్లో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు ప్రభువు ఆశీర్వాదాలు తీసుకొని, సమాజంలో శాంతి, సౌహార్దం నెలకొనాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శివయ్య మాట్లాడుత ఎమ్మెల్సీ డా. సిపాయి సుబ్రహ్మణ్యం గారు విచ్చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్థులు, క్రైస్తవ సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.