మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్ 30
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఏ. రేవంత్ రెడ్డి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ వెంకటే శ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు విచ్చేసినసందర్భంగా, తిరుమలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పూలమాలలతో స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ స్వాగత కార్యక్రమంలోపీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు,శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీసమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్,జిల్లా అధికార ప్రతినిధి శ్రీను గౌడ్,మైనారిటీ సెల్ అధ్యక్షులు ఫయాజ్,శ్రీకాళహస్తి పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆంటోనీ
সহా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.