సారంపల్లి పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్ 13గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో దశ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తంగళ్ళపల్లి మండలంలోని సారంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ శనివారం పరిశీలించారు.సారంపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, అక్కడ ఓటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రం పరిధిలో మొత్తం ఎంత మంది ఓటర్లు ఉన్నారనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.అలాగే వృద్ధులు, దివ్యాంగ...