భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలి :డిప్యూటీ కలెక్టర్ శిక్షణ
మునిపల్లి,డిసెంబర్20(మనప్రజాప్రతినిధి)మునిపల్లి మండలంలో పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కలెక్టర్ శిక్షణ శ్రీ పీ. ప్రతిభా శేఖర్ అధికారులకు సూచించారు.ఈ మేరకు శనివారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామ పాలన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భూభారతి సంబంధిత దరఖాస్తులను ఆలస్యం లేకుండా పరిష్కరించాలని, మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులపై మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) ద్వారా సమయానికి నివేదికలు సమర్పించాలన్నారు.ప్రతి రెవెన్యూ గ్రామంలో రైతులకు అధికారులు అందుబాటులో ఉండి...