manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 30 December 2025, 12:29 pm Editor : Mana Praja Prathinidhi

ఖమ్మంపల్లిలో జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ

సిద్దిపేటనియోజకవర్గం.కొండపాక మండలం(మనప్రజాప్రతినిధి):
కొండపాక మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో మంగళవారం జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించా రు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ తిమ్మాపురం కర్ణాకర్ రెడ్డి ప్రారం భించారు. ఉప సర్పంచ్ తోల్లా నరసింహులు, పశువైద్యాధికారి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గొర్రెలు, మేకలు వంటి జీవాలకు నట్టల నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మందుల వినియోగం వల్ల జీవాలు నులిపురుగుల బారిన పడకుండా ఉండటం తో పాటు, పోషకాలను సమర్థవంతంగా గ్రహించి బరువు పెరగడం, వేగంగా వృద్ధి చెందడం, మరణాల రేటు తగ్గడం జరుగుతుందని వివరించారు.దీని ద్వారా చివరికి గొర్రెలు, మేకల పెంపకందారుల ఆదాయం పెరుగుతుందని అన్నారు. రైతులు తమ జీవాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పశువైద్యాధికారుల సలహాలు, సూచన లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, రైతులు మరియు గ్రామానికి చెందిన పలువురు పాల్గొన్నారు.