ఖమ్మంపల్లిలో జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ
సిద్దిపేటనియోజకవర్గం.కొండపాక మండలం(మనప్రజాప్రతినిధి):కొండపాక మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో మంగళవారం జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించా రు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ తిమ్మాపురం కర్ణాకర్ రెడ్డి ప్రారం భించారు. ఉప సర్పంచ్ తోల్లా నరసింహులు, పశువైద్యాధికారి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గొర్రెలు, మేకలు వంటి జీవాలకు నట్టల నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మందుల వినియోగం వల్ల జీవాలు నులిపురుగుల బారిన పడకుండా...