సదాశివపేట.డిసెంబర్7(మనప్రజాప్రతినిధి)
సదాశివపేటలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తాజోద్దీన్ పాల్గొని, రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారం వంటి అంశాలపై మాట్లాడారు.సదాశివపేట, కొండాపూర్ మండలాల్లో గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై చర్చ జరిగింది. గ్రామస్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి శంకరప్ప, నాయకులు సాదిక్ అలీ, పూలమ్మ, జ్యోతి, సరస్వతి, దేవి తదితరులు పాల్గొన్నారు.