మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్5
ఎర్పేడు మండలం పరిధిలోని నచ్చనేరు ఎస్టీ కాలనీ, వెంకటపాలెం ఎస్టీ కాలనీ, మేర్లపాక ఎస్టీ కాలనీ, కోపాక ఎస్టీ కాలనీలలో గిరిజన కుటుంబాలకు బియ్యం, దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం ఆశ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కార్యక్రమంలో శ్రీనివాసరావు డీఎస్పీ, ఏర్పేడు టిడిపి పార్టీ అధ్యక్షులు నాగరాజు నాయుడు, సీఐ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జి రాఘవేంద్ర, తిరుపతి పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు రాచేటి సుబ్రహ్మణ్యం, ఎస్సీ సెల్‌కు చెందిన కేకే రమణ, యూనిట్ నాయకులు చంద్రశేఖర్ నాయుడు, సీనియర్ నేతలు కృష్ణయ్య, శేషం నాయుడు, నరేంద్ర, కందాడు, మాజీ సర్పంచ్ మనోహర్ నాయుడు, పోలీస్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.