మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.డిసెంబర్9
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల వేళ భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు.
ఈరోజు రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మానాల క్రాస్ రోడ్ చెక్పోస్టును ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న వాహన తనిఖీలు, నమోదు విధానాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్పీ గితే మాట్లాడుతూప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని,వాహనాల వివరాలను వెంటనే రిజిస్టర్‌లో నమోదు చేయాలని,పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తత కోల్పోకుండా విధుల్లో నిబద్ధతతో పనిచేయాలని అధికారులకు ఆదేశించారు.అలాగే, ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా జరిగే నగదు, మద్యం, విలువైన వస్తువుల అక్రమ రవాణాను కఠినంగా అరికట్టాలని స్పష్టం చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పోలింగ్ ప్రక్రియ మొత్తం సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా ప్రజలంతా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.