ఎన్నికల వేళ అక్రమ రవాణాపై కఠిన నిఘా నగదు, మద్యం తరలింపును పూర్తిగా అరికట్టాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.డిసెంబర్9రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల వేళ భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు.ఈరోజు రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మానాల క్రాస్ రోడ్ చెక్పోస్టును ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న వాహన తనిఖీలు, నమోదు విధానాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్పీ గితే మాట్లాడుతూప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని,వాహనాల వివరాలను వెంటనే రిజిస్టర్‌లో నమోదు చేయాలని,పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తత కోల్పోకుండా విధుల్లో నిబద్ధతతో పనిచేయాలని అధికారులకు ఆదేశించారు.అలాగే,...