మనప్రజాప్రతినిధి,అక్బర్ పేటభూంపల్లిమండలం,దుబ్బాక నియోజకవర్గం,సిద్దిపేటజిల్లాడిసెంబర్4
జంగాపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా, వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకయ్య నేడుఘనంగాసన్మానించారు. జంగాపల్లి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంకయ్య,
ఏకగ్రీవ సర్పంచ్ లావణ్యనరసింహారెడ్డి,వార్డు సభ్యులు బిక్షపతి, సుజాత, దేవేందర్ రెడ్డి, స్వామిమొదలైన వారిని శాలువాతో ఘనంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.గ్రామాభివృద్ధి దిశగా కొత్త కమిటీ సమర్థంగా పనిచేస్తుందని, ప్రజల విశ్వాసానికి అనుగుణంగా సేవ చేయాలని ఈ సందర్భంగా చైర్మన్ వెంకయ్య సూచించారు.