ప్రజాసేవ చేసే వారినే సర్పంచ్‌గా ఎన్నుకోండి
కాంగ్రెస్,సీపీఐ.నేతల మంజె మల్లేశం అందే అశోక్ పిలుపుమనప్రజాప్రతినిధి//చేర్యాల.జనగామనియోజకవర్గంజనగామ నియోజకవర్గం చేర్యాల మండలం వీరన్నపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొండపాక కనకలక్ష్మీ బిక్షపతికి మద్దతుగా గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఐ నేతలు మంజె మల్లేశం, అందే అశోక్ పాల్గొని గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఐదు సంవత్సరాలుగా కొండపాక బిక్షపతి సర్పంచ్‌గా గ్రామానికి ఎనలేని సేవలు చేశారని తెలిపారు. కష్టకాలంలో ప్రతి కుటుంబానికి అండగా నిలబడి, ప్రజల కష్టాన్ని తన కష్టంగా...