manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 14 December 2025, 6:39 pm Editor : Mana Praja Prathinidhi

ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి
మనప్రజాప్రతినిధి//చేర్యాల.జనగామనియోజకవర్గం
జనగామ నియోజకవర్గంలో నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 17వ తేదీన ఉదయం 7.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు జరగనున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి కే. హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు.మూడవ విడత ఎన్నికలు జరగనున్న హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట, కొండపాక మరియు కుక్కునూరుపల్లి మండలాల పరిధిలోని గ్రామాల్లో ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
15వ తేదీ సాయంత్రం 5.00 గంటల అనంతరం ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించినా, ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.అలాగే, ఎన్నికల నిబంధనల మేరకు మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న జిల్లాలోని తొమ్మిది మండలాల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5.00 గంటల నుండి 17వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రజలు, అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నియమాలను కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ హైమావతి విజ్ఞప్తి చేశారు.