manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 27 December 2025, 9:38 am Editor : Mana Praja Prathinidhi

నూతన సంవత్సరానికి విద్యార్థులకు ప్రోత్సాహం

UPS నాంచారుపల్లి పాఠశాలలో 120 మంది విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ

మనప్రజాప్రతినిధి//సిద్దిపేట నియోజకవర్గం.డిసెంబర్27
సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లి గ్రామంలోని UPS పాఠశాలలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గ్రామస్థులు అష్టకాల శ్రీనివాస్ రావు, శ్రేయాస్ గారు 120 మంది విద్యార్థులకు వాటర్ బాటిల్స్‌తో పాటు స్వీట్స్, బిస్కట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అష్టకాల శ్రీనివాస్ రావు గారు మాట్లాడుతూ, విద్యార్థులు ఇష్టపడి చదవాలి, క్రమశిక్షణతో ఉండాలి, ఉపాధ్యాయులు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటేనే ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు అని హితవు పలికారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచుతాయని తెలిపారు.
ఈకార్యక్రమంలోపాఠశాల ప్రధానోపాధ్యాయురాలు E. సుజాత, ఉపాధ్యాయులు MV జ్యోతి, అమిత, సునీత, J. శ్రీనివాస్, మిత్రతో పాటు గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.