ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో వీర్ బాల్ దివస్ సందర్భంగా వ్యాస రచన పోటీలు
•పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం : ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డిసిద్దిపేట,డిసెంబర్24 (మనప్రజాప్రతినిధి):సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్)లో ఈ నెల 26న జరగనున్న వీర్ బాల్ దివస్ ను పురస్కరించుకుని వ్యాస రచన పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ శ్రీ సత్యనారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు.సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్‌మెంట్ విభాగానికి చెందిన శ్రీ వేణుగోపాల్ గారు, రీజనల్ కమిషనర్ శ్రీమతి పావని మేడం గారి సూచనల...