manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 2:40 pm Editor : Mana Praja Prathinidhi

గ్రామాల్లో ఎన్నికల హోరు… అభ్యర్థుల పోటీ మరింత ఆసక్తికరం

మెదక్.మనప్రజాప్రతినిధి//డిసెంబర్8
అల్లాదుర్గం గ్రామపంచాయతీ ఎన్నికల జోరు మండలవ్యాప్తంగా ఊపందుకుంది. వివిధ పార్టీ అభ్యర్థులు తమ ప్రచారాన్ని బలంగా కొనసాగిస్తూ, గ్రామాల్లో ఎన్నికల జోరు పెంచుతున్నారు.అల్లాదుర్గం మండలంలోని గాండ్లబావి, తండా, ముస్లాపూర్, సీతానగర్, ముప్పా రం, మాందాపూర్ తదితర గ్రామాల్లో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మండలంలో మొత్తం 16 సర్పంచ్ స్థానాలకు 56 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో పోటీ మరింత రసవత్తరం అయ్యిం ది.తమకు కేటాయించిన గుర్తులను చూపిస్తూ అభ్యర్థులు నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని జరుపుతు న్నారు.ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ రకాలవ్యూహాలతో ప్రచారం సాగుతోంది. ఎన్నిక లు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి, పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేశారు.