మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి: టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
సదాశివపేట,డిసెంబర్23(మనప్రజాప్రతినిధి):మత్స్యకారులు చేపల పెంపకం ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు.సదాశివపేట పట్టణంలోని ఉభ చెరువులో మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఉభ చెరువులో చేప పిల్లలను వదిలినట్లు పేర్కొన్నారు.మత్స్య సంపద అభివృద్ధి ద్వారా మత్స్యకార కుటుంబాలకు...