manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 07 December 2025, 11:26 am Posted by : Mana Praja Prathinidhi

చెవిరెడ్డి జయమ్మ కర్మక్రియల్లోపాల్గొన్న మాజీఎమ్మెల్యేబియ్యపుమధుసూధన్ రెడ్డి

మనప్రజాప్రతినిధిశ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్7
శ్రీకాళహస్తి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూధన్ రెడ్డి మాతృమూర్తి చెవిరెడ్డి జయమ్మ ఇటీవల ఆకస్మికంగా మృతి చెందగా, ఆమె కర్మక్రియలు నేడు స్వగ్రామం పుల్లారెడ్డి కండిగలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూధన్ రెడ్డి పాల్గొని, చెవిరెడ్డి జయమ్మ చిత్రపటానికి పుష్పాలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, వయ్యాల కృష్ణారెడ్డి, బర్రీ సుదర్శన్ రెడ్డి, కాసరం ఢిల్లీ బాబు, కోగిలి సుబ్రహ్మణ్యం, యుగంధర్ రెడ్డి, వయ్యాల మనోహర్ రెడ్డి, కోవిచంద్రయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.