ఇల్లంతకుంట మండలంలో పలు గ్రామాల ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్22ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామపంచాయతీల నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రసమయి బాలకిషన్, గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుండాలని...