శ్రీ కాశమ్మ అమ్మవారి ప్రథమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ బి.బి. పాటిల్
సదాశివపేట,డిసెంబర్28(మనప్రజాప్రతినిధి):సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ప్రభు మందిర్ ఆలయం సమీపంలో వెలసి ఉన్న శ్రీ కాశమ్మ అమ్మవారి దేవాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మాన్ని స్థానిక 11వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ వోదెల రాజేశ్వరి–మాణిక్ రావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.వార్షికోత్సవ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాశమ్మ తల్లికి కళాశాల ఊరేగింపును నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అభిషేకం చేసి, వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. తరువాత డప్పు చప్పుళ్లు, మేళతాళాల మధ్య...