manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 24 December 2025, 2:26 pm Posted by : Mana Praja Prathinidhi

ఇర్కోడు గ్రామంలో ఉచిత నట్టల మందు పంపిణీ4300 గొర్రెలు,1250 మేకలకు నట్టల నివారణ

మనప్రజాప్రతినిధి//సిద్ధిపేట నియోజకవర్గం.రూరల్ మండలం డిసెంబర్ 24:
సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలో ఇర్కోడు గ్రామంలో ఈరోజు 4300 గొర్రెలు, 1250 మేకలకు నట్టల నివారణ మందును ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఘణపురం కృష్ణ ,ఉప సర్పంచ్ బొప్పిడిరాజవ్వ, వార్డు మెంబర్లు, పశు వైద్యులు డాక్టర్ విజయ సారధి, తార JVOతో పాటు గొర్రెల కాపర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గొర్రెల కాపరులతో మాట్లాడిన పశు వైద్యాధికారి విజయ సారధి మాట్లాడుతూ నట్టల నివారణ జరిగితే గొర్రెలు, మేకల్లో ఆకలి గుణం పెరిగి మేతను బాగా తీసుకుంటాయని తెలిపారు. దీంతో జీవులు ఆరోగ్యంగా పెరిగి అధిక బరువు సాధిస్తాయని, గొర్రె పిల్లల మరణాలు తగ్గి మాంస ఉత్పత్తి పెరుగుతుందని వివరించారు. దీనివల్ల పశుపాలకులకు ఆర్థికంగాలాభంచేకూరుతుందనిసూచించారు.కార్యక్రమంలో భాగంగా జీవులకు నట్టల నివారణ మందును తాగించడం జరిగిందనిఅధికారులు తెలిపారు. ఈ ఉచిత కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు గొర్రెల కాపర్లు హర్షం వ్యక్తం చేశారు.